గ్రామాభివృద్ధికి అందరూ చేయూతనివ్వండి... 

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజవర్గం గడివేముల మండలంలో ఉన్నతాధికారులతో ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..గడివేముల ఎంపీడీవో కార్యాలయం నందు గడివేముల మండల సర్వసభ్య సమావేశంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన, గడివేముల మండల ఎంపీడీవో విజయసింహ రెడ్డి,జెడ్పిటిసి. ఆర్ బీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గడివేముల మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా మండలంలోని అధికారులు గ్రామానికి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేస్తున్నారని అడగగా..మండలంలోని అధికారులు మాట్లాడుతూ


గడివేముల మండలంలోని గ్రామంలో చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ మండలంలో మొత్తం గ్రామపంచాయతీలో సంఖ్య 16 ఉన్నాయని, మొత్తం గ్రామ సంఘాలు 33 ఉన్నాయని గడివేముల మండలంలో ఎస్ హెచ్ జి సభ్యులు మొత్తం 10,857 మంది ఉన్నారని ,బ్యాంకు తో అనుసంధానం కలిగిన SHG లు 464 గ్రూపులు ఉన్నాయని వారికి కి 1861.11 కోట్లు రూపాయలను రుణాలు ఇచ్చామని స్త్రీ నిధి కింద అ అర్హులైన 105 మందికి  1, 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అర్హులైన ఎస్సీ మరియు ఎస్ టి (cpf) లోను పొందిన 171 లబ్ధిదారులకు 11,52,525 ఇచ్చామని, వైయస్సార్ చేయూత కింద "సున్నా" వడ్డీలకు 315 మందికి 5,50 కోట్లు పంపిణీ చేశామని, వైయస్సార్ చేయూత కింద 28 మంది లబ్ధిదారులకు 5.25 లక్షలు వైఎస్ఆర్ ఆసరా కింద అర్హత పొందిన సంఘాలు మొత్తం 598 లబ్ధిదారులకు మొదటి విడతగా గ్రూపులకు 212,30 లక్షలు వచ్చాయని,

రెండవ విడతగా 212 పాయింట్ 30 లక్షలు వచ్చాయని, జగన్ అన్న తోడు కింద 347 మంది సభ్యులకు 10,000వేల రూపాయల చొప్పున 3,47 లక్షల రూపాయలు మంజూరు చేశామని, పాఠశాలలకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రెండో విడతలో 3 పాఠశాలలు జడ్.పి.హెచ్.ఎస్ గడివేముల, కొరటమద్ది, గని గ్రామాల్లోని పాఠశాలకు2,67,000 మంజూరయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. అనంతరం పాణ్యం  ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో జరిగే అభివృద్ధికి గ్రామంలోని ప్రజలందరూ సహకరించాలని ఉపాధి హామీ పథకంలో పని చేసే వారికి మాత్రమే గుర్తింపు ఇవ్వాలని పని చేయని వారికి గుర్తింపు ఇవ్వొద్దని ఆయన తెలిపారు. అనంతరం  గడివేముల మండలంలో  ముఖ్యమంత్రి సహాయ నిధికి విడుదలైన మొత్తం 1,40,000  మొత్తంను 4 సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి  విజయసింహారెడ్డి, గడివేముల జెడ్ పి టి సి, ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ మద్దమ్మ, పాణ్యం సిఐ గంగాధర్ బాబు, ఎస్సై హుస్సేన్ బాషా, గడివేముల మండలం లోని అన్ని శాఖల అధికారులు, గడివేముల మండల సర్పంచులు, మండలంలోని గ్రామాల రైతులుపాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: