సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదు: సంజయ్ రౌత్


కాశ్మీర్ వంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదు అని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇదిలావుంటే మొద‌ట కేవ‌లం 400 థియేట‌ర్ల‌లోనే విడుద‌లైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు ఏకంగా 4,000 థియేట‌ర్ల‌లో ఆడుతూ రికార్డుల‌ను తిర‌గ‌రాసే దిశ‌గా వెళ్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం నోటి మాట ద్వారా ఈ సినిమాకు ఎన‌లేని ప‌బ్లిసిటీ వ‌స్తోంది. ఈ సినిమాపై వివాదాలు కూడా రాజుకుంటుండ‌డంతో దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ స్పందించారు. క‌శ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని హిత‌వు ప‌లికారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ కేవలం సినిమా మాత్రమేనని అన్నారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరికీ రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని తాను అనుకోవట్లేద‌ని తెలిపారు. ఎన్నికల నాటికి ఈ సినిమాను ప్రజలు మర్చిపోతారని చెప్పారు. కాగా, ఈ సినిమాపై కొంద‌రు నేత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌గా, ఇందులో అస‌త్యాలు చూపించారంటూ మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: