మీసేవ నిర్వాహకులను కాపాడండి... 

మాపై ఎందుకంత కసి

మమ్మల్నీ ఆదుకోండి అని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మీ సేవా నిర్వాహకుల వినతి


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మీ సేవలను నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రాణం పోస్తాడని  మీ సేవా నిర్వహకులు పెట్టుకొన్న ఆశలు  గల్లంతయ్యాయి. ఇదే విషయమై మీ సేవా కేంద్ర  నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీసేవ కేంద్రాలనుంచి తొలగించిన  వన్ బి, అడంగల్, రేషన్ కార్డు సర్వీసులు, ఎలక్షన్ సర్వీసులను తిరిగి  పునరుద్ధరించాలని కోరుతూ మీసేవ నిర్వాహకులు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీసేవ నిర్వాహకులు మాట్లాడుతూ...


రాష్ట్రంలో మొత్తం పదకొండు వేల మీ సేవ కేంద్రాలున్నాయని, వాటిపై ఆధారపడి సుమారు 60 వేల కుటుంబాలు బతుకుతున్నాయని వారు పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థతో తమ జీవనోపాధి కోల్పోయామని, ఇప్పుడు ఉన్న సర్వీసులు కూడా ఒక్కోక్కటిగా తొలగిస్తూ వస్తే తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆందోళనవ్యక్తంచేశారు. దయచేసి మీ సేవ కేంద్రాల నుంచి తొలగించిన సర్వీసులను  తిరిగి పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ సర్వీసులను తొలగించటం వల్ల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు బ్యాంకుల దగ్గర, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర సచివాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని వారు పేర్కొన్నారు. తమ పనులు చేసుకోలేక ప్రజలు తిరిగి తమ గ్రామ సచివాలయాలకు వెళ్లే పరిస్థితి దాపురిస్తోందని వారు పేర్కొన్నారు. మీ సేవా కేంద్రాలలో సర్వీసుల తొలగింపు వల్ల సాధారణ  ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఇలా నంద్యాల మీసేవ అసోసియేషన్ సభ్యులు చేసిన విన్నపం పట్ల నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: