ఎయిర్ ఇండియాకు ఐచీ గుడ్ భై


ఇండియన్ ఎయిర్ లైన్స్ ను గట్టేక్కించే పనిలో నిమగ్నమైన టాటా గ్రూప్ చేదు వార్త వినాల్సివచ్చింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటాలకు ఆదిలోనే విఘ్నం ఎదురైంది. ఏరికోరి టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ అయిన ఇల్కర్ ఐచీని ఎయిర్ ఇండియా సీఈవోగా నియమించినట్టు టాటా గ్రూపు రెండు వారాల క్రితం ప్రకటించింది. కానీ, ఈ ఆఫర్ ను ఐచీ తిరస్కరించారు. అదేదో మొదటే చెప్పేసి ఉంటే బావుండేదేమో! కానీ, మొదట అంగీకరించిన ఆయన.. తదనంతరం ఏమి ఆలోచించుకున్నారో కానీ, తాను ఈ పదవిని చేపట్టడం లేదంటూ టాటా గ్రూపునకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని టాటా గ్రూపు అధికార ప్రతినిధి వెల్లడించారు. టర్కీతో భారత్ కు సత్సంబంధాలు లేవు. భారత వ్యతిరేక వైఖరితో ఉండే టర్కీ, కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ కు అనుకూల వైఖరిని కూడా ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో టర్కీలో రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగిన ఐచీని ఎయిర్ ఇండియా సీఈవోగా నియమించడం పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అభ్యంతర వైఖరితో ఉంది. ఐచీ నియామకాన్ని బ్లాక్ చేయాలని కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్ర సర్కారు ఈ నియామకానికి ఇంకా ఆమోదం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఇల్కర్ ఐచీ ఆఫర్ ను వదులుకున్నారు!

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: