రాధేశ్యామ్ ముంబాయిలో మెరుస్తోంది


రాధేశ్యామ్ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి ప్రారంభమైంంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆయ‌న న‌టించిన‌ 'రాధే శ్యామ్' సినిమా ఈ నెల 11వ తేదీన విడుదల కానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్లు అప్పుడే దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ద‌ర్శ‌నం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముంబైలో రాధేశ్యామ్ పోస్ట‌ర్లు క‌న‌ప‌డుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్-పూజ హెగ్డే జంట రైలులో ప్రేమ‌లో మునిగితేలిపోయే స‌న్నివేశానికి సంబంధించిన పోస్ట‌ర్ ముంబైలో క‌న‌ప‌డింది. మ‌రో పోస్ట‌ర్‌లోనూ హీరో హీరోయిన్లు ఉన్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్లు రేప‌టి నుంచి మ‌ళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రేపు మ‌రో ట్రైలర్ కూడా విడుద‌ల కానుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: