పదవ తరగతిలో 100%, ఉత్తీర్ణత సాధించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం లో విద్యాశాఖ అధికారి రంగారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే...గడివేముల మండలం లోని పాఠశాలలను కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గడివేముల మండలంలోని బిలకలగూడూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను, ఉర్దూ పాఠశాలను,  కోరటమద్ది గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను, కేజీబీవీ పాఠశాల, గడివేముల గ్రామం లోని ఏపీ మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు, పాఠశాలలోని విద్యార్థిని,విద్యార్థులతో మాట్లాడుతూ  ఉపాధ్యాయులు తరగతి వేళకు పాఠశాలలకు వస్తున్నారా లేదా మీకు విద్యా బోధన సక్రమంగా చెబుతున్నారా లేదా మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని పిల్లలను అడిగి మరీ తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ని రికార్డులను పరిశీలించారు, 


ఈ సందర్భంగా డీఈవో రంగారెడ్డి మాట్లాడుతూ మండలంలో పదవ తరగతిలో విద్యార్థినీ విద్యార్థులు అందరూ 100% ఉత్తీర్ణత సాధించాలని, చదివిన పాఠశాలకు, చదివించిన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, సంఘంలో ఉన్నత మైన న్యాయ విలువలతో కూడిన  జీవితాన్ని గడపాలని వారు విద్యార్థులకు సూచించారు, ఈ సందర్భంగా పాఠశాలలో పంపిణీ అవుతున్న నులిపురుగుల నివారణ మాత్రల కార్యక్రమాన్ని పరిశీలించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: