సామాజిక సేవలో...

డాక్టరేట్ సాధించిన ఆయిషా సుల్తానా

(జానో జాగో వెబ్ న్యూస్- ఖమ్మం ప్రతినిధి)

సమస్యలు ఎక్కడుంటే ఆమె అక్కడుంటారు.. అతి చిన్న వయస్సులోనే తాను చేసిన సేవకు గుర్తింపుగా డాక్టరేట్ పొంది డాక్టర్ ఆయిషా సుల్తానాగా ఎంతోమంది మన్ననల్ని పొందుతున్నారు. ఖమ్మం నగరానికి చెందిన ఆయిషా సుల్తానా జమాఅతె ఇస్లామీహింద్ తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  గా సేవలందిస్తున్నారు. గత పదేళ్లుగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మహిళా సాధికారత, వృద్ధాశ్రమాలకు సహాయ సహకారాలు అందించడం, ప్రభుత్వ బడుల విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, పెన్నులు అందించడం, పేదలకు  అనాథలకు దుప్పట్లు పంచడం, ఆకలి తీర్చడం చేస్తున్నారు. ఆమె సేవల్ని గుర్తించిన ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ (IACHRC) ఆమెకు గౌరవ డాక్టరేట్ ను అందించింది. ఐక్యరాజ్య సమితీ (యూఎన్ఓ) అనుబంధంగా ఉన్న ఈ సంస్థ ఆమెకు ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందించడం పట్ల పలువురు ప్రముఖులు ఆమెను అభింనదిస్తున్నారు. చెన్నైలో ఇటీవలె జరిగిన స్నాతకోత్సవ సమావేశంలో ఈ అవార్డుల ఫంక్షన్ జరిగింది. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ సమయంలో ఆమె ఎంతోమంది ఉపాధి కోల్పోయిన కూలీలను, నిరుపేదలను ఆదుకున్నారు. తలుపుతట్టి మరీ నిత్యావసరాలు అందించారని సంస్థ ప్రసంసిస్తూ ఆ సంస్థ తమ వైబ్ సైట్లో కథనాన్ని ప్రచురించింది.  అణగారిన వర్గాల పిల్లలకు చదువు చెప్పేందుకు సాయంత్రం తరగతులు నిర్వహించారని వెబ్ సైట్ పేర్కొంది. సమాజంలోని వివిధ రంగాలలో ఆమె చేస్తున్న సామాజిక సేవల్ని సంస్థ కొనియాడింది. సామాజిక సేవా రంగంలోనే కాక విద్యారంగంలోనూ ఆమె విశిష్ట సేవల్ని అందిస్తున్నారు. సామాజిక సేవ చేస్తూనే లాక్ డౌన్ సమయంలో 200కి పైగా ఆన్ లైన్ కోర్సులు నేర్చుకున్నారామె. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఆమెను పలు పురస్కారాలతో సత్కరించాయి. ఎన్నో సంస్థలు ఆమెను కరోనా వారియర్ గా ప్రశంసించాయి. నగరానికి చెందిన ఆయిషా సుల్తానా ఇంత పెద్ద పురస్కారం లభించడం అభినందనీయము. మున్ముందు మరిన్ని అవార్డులు అందుకోవాలని నగర ప్రముఖులు ఆశిస్తున్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: