నమోకు కొత్త భాష్యం చెప్పిన కేటీఆర్


'నమో' అంటే నమ్మించి మోసం చేసేవాడు అంటూ నరేంద్ర మోదీ సంక్షిప్త నామానికి కొత్త భాష్యం చెప్పారు మంత్రి కేటీఆర్. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న టీఆర్ఎస్ అధినాయకత్వం ఎక్కడా తగ్గేదిలేదన్న సంకేతాలు పంపుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. 'నమో' అంటే నమ్మించి మోసం చేసేవాడు అంటూ నరేంద్ర మోదీ సంక్షిప్త నామానికి కొత్త భాష్యం చెప్పారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. వేములవాడకు పైసా తీసుకురాని బండి సంజయ్ నువ్వు ఎంపీగా ఎందుకున్నావ్? అంటూ ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం నాయకుడో అర్థం కాదు... కుంభమేళాకు రూ.300 కోట్లు ఇచ్చి, మేడారం జాతరకు రూ.2 కోట్లేనా? అని నిలదీశారు. "బీజేపీని బట్టలిప్పి కొడదాం... కేసీఆర్ ను ఏమైనా అంటే చుక్కలు చూపిద్దాం, కేసీఆర్ ను ఒక్కమాట అన్నా ఫిరంగులై గర్జిద్దాం" అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: