పెరుగుతున్న ఎండ తీవ్రత...ఎండాకాలం వచ్చేసినట్లే


మొన్నటి వరకు చలి దంచికొడితే ఇపుడు సూర్యుడికి అవకాశం వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలం ప్రారంభమయినట్టే కనిపిస్తోంది. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని తిరుపతిలో నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.1 డిగ్రీలుగా నమోదయింది. కర్నూలు, అనంతపురం పట్టాణాల్లో 36.6 డిగ్రీలు... కడపలో 36.2 డిగ్రీలు, తునిలో 36.1 డిగ్రీలు, ఒంగోలులో 35.7 డిగ్రీలు, అమరావతిలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో సైతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హైదరాబాదులో గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు చేరుకుంది. పలు పట్టణాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మార్చి తొలి వారంలోనే ఎండలు మండేలా కనిపిస్తున్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: