జగ్గారెడ్డి ఉదంతం ఒక దురదృష్టకర పరిణామం 

 టి.పి.సి.సి. ఉపాధ్యక్షులు జి.నిరంజన్

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

కాంగ్రెస్ పార్టీ లో జగ్గారెడ్డి ఉదంతం ఒక దురదృష్టకర పరిణామం అని టి.పి.సి.సి. ఉపాధ్యక్షులు జి.నిరంజన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పరిస్థితులుచక్కదిద్దుకోవడములో వైపల్యమే ఈ  పరిస్థితికి కారణం అందరూ కల్సికట్టుగా పని చేస్తేనే పార్టీ బలపడుతుంది. ఏ ఒక్కరో తమతోనే సాధ్యమని భావిస్తే అది భ్రమగానే మిగిలి పోతుంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని విలువలు సిద్దాంతాలు కల్గిన పార్టీ గా ప్రజలు గౌరవిస్తారు. వాటిని పాటించే బాధ్యత నాయకత్వము పై ఉంటుంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తినకుండా ఉంటుంది. వ్యక్తుల పేర్ల మీద ఉన్న సేనలు, సోషల్ మీడియా గ్రూపులు పార్టీకి తీవ్రమైన నష్టము చేస్తున్నాయి. వాటిని కట్టడి చేయకుంటే ఆయా నాయకుల భవిష్యత్తే దెబ్బతినే ప్రమాద మున్నది .కొంపలో ఎలుక దూరితే ఎలుకను పార ద్రోలాలి కాని మనము కొంపను కాల్చడమో, కొంపను వదిలి పెట్టి పోవడమో చేయకూడదు. జగ్గారెడ్డి ఆవేదనలో తప్పు లేదు. ఆయన తన నిర్ణయాన్ని మార్చు కోవాలని కాంగ్రెస్ లోనే ఉండి ప్రజాసేవ చేయాలని విఙప్తి చేస్తున్నాను.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: