ముగిసిన భీమ్లా నాయక్ చిత్రం షూటింగ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ చిత్రం పూర్తి చేసుకొంది. విడుదలకు మరో వారం సమయం ఉందనగా భీమ్లా నాయక్ చిత్రం షూటింగ్ ముగిసింది. చివరి షెడ్యూల్ లో మిగిలి ఉన్న సన్నివేశాలను గత కొన్నిరోజులుగా హైదరాబాదు రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు. హీరో పవన్ కల్యాణ్ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, షూటింగ్ పూర్తయిందని భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్, విలక్షణ పోలీసాఫీసర్ పాత్ర పోషించగా, రానా ప్రతినాయకుడిగా నటించారు. తమన్ సంగీతం అందించగా, ఇప్పటికే పాటలు సూపర్ హ్టిటయ్యాయి. భీమ్లా నాయక్ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందిచడం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: