మరింత దిగొస్తుంది...ఏపీలో స్వల్పంగా కరోనా కేసులు


ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ బలహీనపడుతోంది. ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 18,915 కరోనా పరీక్షలు నిర్వహించగా, 280 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంత‌పురం, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో అత్య‌ధికంగా 44 కేసుల చొప్పున న‌మోదు కాగా.. ప్ర‌కాశం జిల్లాలో 40 కేసులు న‌మోద‌య్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 38 కేసులు న‌మోద‌య్యాయి. అదే సమయంలో 496 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,464 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,98,033 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,709 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 14,722కి పెరిగింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: