వెంకయ్యనాయుడు కుమార్తె వివాహానికి ప్రముఖుల రాక


ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  కుమార్తె ఎం.దీప-వెంకటరావు దంపతుల కుమార్తె సుష్మ-కిషన్ వివాహానికి ప్రముఖులు తరలివచ్చారు. తిరుమలలోని పుష్పగిరి మఠంలో వైభవంగా జరిగిన ఈ వివాహానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్, బీజేపీ నేత సత్యకుమార్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కరోనా నేపథ్యంలో ఈ వివాహానికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. కాగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: