స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో ఉద్యమించాలి

ఆవాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ* కార్యక్రమంలో...

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల  చిత్రపటాలతో ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రూపొందించిన క్యాలెండర్ ను ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో తమ సర్వం త్యాగం చేసి గుర్తింపుకు నోచుకోని సమరయోధులను ఆవాజ్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని భావించి, ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల క్యాలెండర్ రూపొందించిందన్నారు. మతోన్మాదులు చరిత్రకు వక్రభాష్యం చెబుతున్నారు, వక్రీకరిస్తున్నారు.

స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములు కానటువంటి మతోన్మాదులు ముస్లిం మైనార్టీల దేశభక్తి గురించి ప్రశ్నించడం హాస్యాస్పదం అన్నారు. దేశ ప్రజలను ప్రేమించి, వారి అభివృద్ధికి పాటుపడటమే నిజమైన దేశభక్తి అని, ద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బంగడుపుకోవడం దేశభక్తి కాదన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమిస్తుంటే మతోన్మాదులు మతం పేరుతో ప్రజలమధ్య చీలికలు తెచ్చి, ఐక్యతను దెబ్బతీశారు. సామ్రాజ్యవాదులకు సహకరించారు.వారు దేశభక్తి గురించి ప్రజలకు పాఠాలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ప్రజా ఉద్యమం సాధించిన స్వాతంత్ర్యాన్ని మతోన్మాదులు కాలరాస్తున్నారు. నిరంకుశ విధానాలతో ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరించి, ప్రజల ఆస్తులను కారుచౌకగా విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ను, స్వాతంత్ర్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవాలంటే స్వాతంత్రోద్యమ నాయకుల స్ఫూర్తితో ఉద్యమించాలని, లౌకిక, ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ సత్తార్, ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, గులాం నశీర్ యాకూబ్, ఖాజా గరీబ్, రోషన్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: