బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆపర్....కానీ షరత్తులు వర్తిస్తాయి

అన్ని మొబైల్ కంపెనీలు  తమ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో టెలికాం రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ను కష్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కొన్ని షరతులతో రూ. 197కే 150 రోజుల వ్యాలిడిటీని అందించే ప్లాన్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రతి రోజు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఆఫర్ చేస్తోంది. అయితే ఇక్కడో షరతు ఉంది. ఈ ప్రయోజనాలకు 18 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నా... ఔట్ గోయింగ్ కాల్స్, ఇంటర్నెట్ కోసం టాప్ అప్ వేయించుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులకు సుదీర్ఘ వ్యాలిడిటీ అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. అయితే 18 రోజుల తర్వాత టాప్ అప్ వేయించుకోకపోయినా... ఉచిత ఇన్ కమింగ్ సౌకర్యం మాత్రం ఉంటుంది. ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్ గా ఉంటుంది. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: