కరోనా కేసులు గ్రేటర్ పరిధిలోనే అధికం


కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో స్పీడు తగ్గించినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం అధికంగా ఉంది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,288 కరోనా పరీక్షలు నిర్వహించగా, 401 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 124 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 25, రంగారెడ్డి జిల్లాలో 24, మంచిర్యాల జిల్లాలో 23 కేసులు గుర్తించారు. అదే సమయంలో 865 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,422 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,76,667 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,646 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,109కి పెరిగింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: