ఉన్నంతలో మంచి ప్యాకేజీ ఇచ్చాం: సజ్జల


పీఆర్సీని ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించిందని, ఉన్నంతలో మంచి ప్యాకేజీ ఇచ్చామని వెల్లడించారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు సీఎం జగన్ పై మాట్లాడుతున్న తీరు సరిగాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలమంది ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పిస్తున్న సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఉపాధ్యాయులకు ఏడెనిమిది విషయాల్లో తాము ఉపకారం చేశామని సజ్జల స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే  స్కూల్ అసిస్టెంట్లకు  ప్రమోషన్లు వచ్చినట్టు ఉపాధ్యాయులే చెప్పారని వెల్లడించారు. గత ప్రభుత్వంలోని లేని ఉద్యోగ భద్రతను తాము కల్పించామని ఉద్ఘాటించారు. కరోనా వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏవిధంగా మారిందో అందరికీ తెలుసుని, మరోపక్క సంక్షేమానికి కూడా నిధులు అవసరమైన పరిస్థితి తలెత్తిందని వివరించారు. కొవిడ్ కారణంగా ఏర్పడిన సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదని, చర్చల సమయంలో ఉద్యోగులకు పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదని సజ్జల విమర్శించారు. పీఆర్సీని ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించిందని, ఉన్నంతలో మంచి ప్యాకేజీ ఇచ్చామని వెల్లడించారు. కానీ ఉద్యోగులను రోజూ చర్చలకు పిలుస్తున్నా, స్పందన లేదని ఆరోపించారు. బలప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏంసాధిస్తారో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: