యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొన్న మహేశ్ బాబు


కాలుకు గాయమై మహేశ్ బాబు ప్రస్తుతం వాటి నుంచి కోలుకొని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొన్నారు. మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనున్నాయి. ఇంతవరకూ దుబాయ్ .. స్పెయిన్ .. గోవాలలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగు హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. మహేశ్ బాబు మోకాలు నొప్పి కారణంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ ను వాయిదా వేశారు. ఆ తరువాత మహేశ్ బాబు మోకాలు సర్జరీ చేయించుకోవడం .. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవడం జరిగిపోయాయి. అందువలన ఇప్పుడు ఆ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. మహేశ్ బాబు తదితరులపై చిత్రీకరణ కొనసాగుతోంది. మైత్రీ - 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ సందడి చేయనుంది. సముద్రఖని ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, వెన్నెల కిశోర్ కామెడీ హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. మే 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: