గడివేముల మండల టిడిపి ఆధ్వర్యంలో..

ప్రజాభిప్రాయ సేకరణ

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి) 

రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిందనీ, అందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అని అయితే పాణ్యం , గడివేముల మండలాలను కర్నూలు జిల్లాలో కలుపుతున్నట్లు వార్త రావడంతో రెండు మండలాల  ప్రజలు  ఆందోళనకు గురవుతున్నారని. అయితే  ప్రజలు  నూతనంగా ఏర్పడబోయే నంద్యాల జిల్లాకు గడివేముల గ్రామం కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల నంద్యాల  జిల్లాను గడివేముల మండలం లోని ప్రజలందరూ కోరుకుంటున్నారనీ, ప్రజలు కూడా రాజకీయ నాయకుల ప్రలోభాలకు తలొగ్గకుండా పాలనా సౌలభ్యం కోసం,  ప్రజల  అవసరాల కోసం, నిత్య అవసరాలైన కూరగాయల మార్కెట్,  ప్రజల ఆరోగ్య రీత్యా వైద్య సదుపాయాన్ని వైద్య సదుపాయానికి,వ్యవసాయ పరంగా విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు, పాణ్యం మరియు గడివేముల మండల ప్రజలు మండలాల్లోనీ  గ్రామాల ప్రజలు  రవాణా సౌకర్యం కలిగిన నంద్యాల మీదనే ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది . అటు పాణ్యం, గడివేముల మండల ప్రజలు కర్నూలుకు వెళ్లవలసి వచ్చినప్పుడు 68 కిలోమీటర్ల దూరంలో ఉండే కర్నూలు జిల్లాకు వెళ్లడానికి ఎంత సమయం వెచ్చించాల్సి వస్తుందో


అధికారులు ప్రజా ప్రతినిధులు ఆలోచించు కోవాలని నంద్యాల కు కొన్ని గ్రామాలు కూతవేటు దూరంలో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయని వీరందరినీ తీసుకుని వెళ్లి కర్నూలు జిల్లాలో కలిపితే  సామాన్య ప్రజలు అందరూ ఇబ్బందులకు గురవుతారని రెండు మండలాల్లో ప్రజలు ప్రతి గ్రామం నుండి ప్రజలందరూ,  వార్డు మెంబర్లు,సర్పంచులు, ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సంతకాలు చేయవలసిన అవసరం ఉందని, పాణ్యం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పాణ్యం, గడివేముల,మండలాలు వెనుకబాటుతనానికి గురయ్యాయని ఎలాంటి అభివృద్ధి జరగలేదని  అదేవిధంగా పాణ్యం, గడివేముల మండలాలని నూతనంగా ఏర్పడ్డ నంద్యాల జిల్లాలో కలపాలని పాణ్యం, గడివేముల మండలాల్లోని ప్రజలు కోరుకుంటున్నారని, అందులో భాగంగానే ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ చేపట్టామని గడివేముల మండలం టీడీపీ కన్వీనర్ దేశం సత్యం రెడ్డి,  చిందుకూరు విద్యా కమిటీ చైర్మన్ జంగిటి రామలింగం, లక్ష్మయ్య, రమణ పల్లపు, తిరుపాడు రాజు గడివేముల రమణారెడ్డి, దేశం నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగ శేషులు,మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: