ఏపీలో బలహీనపడ్డ కరోనా వైరస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా బలహీనపడుతోంది. ఏపీలో కొన్నివారాల కిందట ఉద్ధృతంగా వ్యాపించిన కరోనా మహమ్మారి క్రమంగా శాంతిస్తోంది. తాజాగా 2 వేలకు లోపే రోజువారీ కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 18,601 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,597 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 478 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 220, గుంటూరు జిల్లాలో 144, చిత్తూరు జిల్లాలో 123, కడప జిల్లాలో 117, విజయనగరం జిల్లాలో 100, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 15 కేసులను గుర్తించారు. అదే సమయంలో 8,766 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 14,672కి పెరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,05,052 మంది కరోనా బారినపడగా, వారిలో 22,27,985 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 62,395 మంది చికిత్స పొందుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: