ద్రోహం చేసే ప్రభుత్వం మాది కాదు: కన్నబాబు


చంద్రబాబులా వేధించి ద్రోహం చేసే ప్రభుత్వం తమది కాదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఉద్యోగుల ఆందోళనలు, ఛలో విజయవాడ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఉద్యమాన్ని వారే నడిపిస్తున్నట్టుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబులా వేధించి ద్రోహం చేసే ప్రభుత్వం తమది కాదని స్పష్టం చేశారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. అటు, హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వ్యాఖ్యానిస్తూ, సీఎం జగన్ ది ఫ్రెండ్లీ ఫ్రభుత్వమని అభివర్ణించారు. ఉద్యోగులు కూడా తమ కుటుంబసభ్యులే అని వివరించారు. సీఎం జగన్ అడగకుండానే ఐఆర్ ఇచ్చిన విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: