మాకు కర్నూలు జిల్లా వద్దు..

నంద్యాల జిల్లా కావాలి

విద్యార్థి సంఘాల ఆత్మగౌరవ ర్యాలీ

ఎమ్మార్వో నాగమణికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

గడివేముల , పాణ్యం మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలని కోరుతూ విద్యార్ధుల ఆత్మగౌరవ ర్యాలీ గడివేముల మండలం లో నిర్వహించారు. నంద్యాల జిల్లాలోనే కలపాలని విద్యార్థినీ, విద్యార్ధులు. విద్యార్థి సంఘం నాయకులు ముక్తకంఠంతో నినాదించారు. నంద్యాల జిల్లాలో పాణ్యం, గడివేముల మండలాలను కలిపేంత వరకు పోరాటం సాగిస్తామనీ,

గడివేముల , పాణ్యం మండలాలను నంద్యాల జిల్లాలోనే కలిపేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని, గడివేములలో విద్యార్ధి ,యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్ధి ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో భారీ ర్యాలీని కొత్త బస్టాండు మీదుగా నిర్వహించి  నిరసన తెలియజేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ నాగమణి గారికి విద్యార్థిని,విద్యార్ధులు , విద్యార్థి సంఘాల నేతలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు , బీసీ - ఎస్సీ - ఎస్టీ - మైనారిటీ విద్యార్ధి , యువజన సమాఖ్య జిల్లా అథ్యక్షుడు పెరుగు శివకృష్ణ యాదవ్ , ఆర్వీఎఫ్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు ప్రతాప్ , రియాజ్ లు మాట్లాడుతూ


  ఇప్పటికే పాణ్యం , గడివేముల ప్రజలందరూ కర్నూలు జిల్లాలో చేర్చడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనీ , గడివేముల ప్రజలకు వ్యాపారరీత్యా, వైద్యపరంగా గా నంద్యాల తో ఎంతో అనుబంధం ఉందని, నంద్యాల జిల్లాను ప్రజలు స్వాగతిస్తుంటే , ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయంతో కర్నూలు జిల్లాలో కలపాలనుకోవడం భాదాకరమన్నారు. గడివేముల ప్రజలు ప్రతి విషయానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే కర్నూలు కి వెళ్లడం వ్యయ ప్రయాసలతో కూడిన పని అని తెలుసుకొని , మండలంలోని ప్రతి గ్రామ పంచాయితీలో గ్రామ సర్పంచుతో కర్నూలు జిల్లా వద్దు - నంద్యాల జిల్లాలోనే మా మండలాలను కలపాలని ఏకగ్రీవంగా తీర్మాణాలు చేసి కలెక్టర్ కు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మహేష్ , మరళీ , ప్రసాదు , చంద్ర , జగదీష్ , వేణు , గడివేముల మండలం లోని  విద్యార్ధినీ , విద్యార్ధులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: