గడివేముల శ్రీ శ్రీ శ్రీ మూల పెద్దమ్మ,,,

నూతన కమిటీ ఏర్పాటు

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

 కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గడివేముల మండల పరిధిలోని శ్రీ శ్రీ మూల పెద్దమ్మ ఆలయంలో నూతన ధర్మకర్తల నియామకం జరిగింది. వివరాల్లోకి వెళితే..గడివేముల మండలం లోని శ్రీ శ్రీ శ్రీ మూల పెద్దమ్మ ఆలయం కమిటీ నూతన కార్యవర్గ సభ్యులను పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎంపిక చేశారు. గడివేముల జడ్పిటిసి ఆర్.బీ.చంద్రశేఖర్ రెడ్డి. దేవాలయ ఆలయ కమిటీ చైర్మన్ టీ.చిన్నన్న కమిటీ సభ్యులు రమణమ్మ, నాగ సులోచన, నాగేంద్రు, కేశాలు, ఆంజనేయులు, సూర్య వెంకట లక్ష్మమ్మ ను ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 
నూతన కార్యవర్గం ఏర్పడుతున్న సందర్భంగా నూతనంగా ఏర్పడిన  కార్యవర్గ సమావేశం దేవస్థానం సొమ్మును తీసుకొని స్వప్రయోజనాలకు వాడకుండా గడివేముల అమ్మవారి దేవాలయ అభివృద్ధికి ఉపయోగించాలని
ప్రమాణస్వీకారం చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

గడివేముల మండల అభివృద్ధికి ఇది  ఒక్క నిదర్శనంగా నిలవాలని, గడివేములకు అమ్మవారిని దర్శించుకోవడానికీ మంగళవారం వివిధ గ్రామాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోజన సౌకర్యాన్ని, మంచినీటి సౌకర్యాన్ని  JSW సిమెంటు యాజమాన్యం చే మాట్లాడించి ఏర్పాటు చేయించడం జరిగిందని,

స్విచ్ ఆన్ చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిి

 మండలంలో అభివృద్ధి ముఖ్యమని , ఆయన పేర్కొన్నారు ఈ  కార్యక్రమంలో గడివేముల జెడ్ పి టి సి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, మంచాలకట్ట అనిల్ కుమార్ రెడ్డి , బూజు నూరు రఘు మాధవ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: