భావోద్వేగానికి గురైనా అవేశ్ ఖాన్...ఎందుకో తెలుసా


మనషి అన్నాక భావోద్వేగాలుంటాయి. అది సామాన్యుడికైనా ఉన్నత హోదాలో ఉన్నవాడికైనా. ఇదిలావుంటే ఇంత వరకు భారత జట్టు తరఫున ఒక్క వన్డే అంతర్జాతీయ మ్యాచ్ లోనూ పాల్గొనని ఆటగాడు, ఐపీఎల్ వేలంలో రూ.10 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన పేసర్ అవేశ్ ఖాన్.. ఢిల్లీ జట్టుకు దూరం కావడం పట్ల భావోద్వేగానికి గురవుతున్నాడు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, కోచ్ రికీ పాంటింగ్ మార్గదర్శనం కోల్పోయనన్న బాధతో ఉన్నాడు. వేలం ముగిసిన తర్వాత రిషబ్ పంత్ నుంచి వచ్చిన స్పందన తన హృదయాన్ని తాకినట్టు అవేశ్ ఖాన్ తెలిపాడు. ‘‘మా విమానం కోల్ కతాలో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వచ్చి రిషబ్ ను కలిశాను. రిషబ్ పంత్ రెండు చేతులు చాచి హత్తుకున్నాడు. ‘క్షమించు వేలంలో కొనుగోలు చేయలేకపోయాము’ అని అన్నాడు. ఎందుకంటే వారి దగ్గర కొనుగోలుకు కావాల్సినంత పర్స్ లేదు. తర్వాత వేలాన్ని వీడియోలో చూశాను. నా కోసం ఢిల్లీ క్యాపిటల్స్ 8.75 కోట్ల వరకు బిడ్ చేసింది. కానీ, లక్నో సూపర్ జెయింట్స్ రూ.10 కోట్లతో అత్యధిక బిడ్ చేసి గెలుచుకుంది’’ అని ఒక వార్తా సంస్థతో అవేశ్ ఖాన్ తెలిపాడు. రిషబ్ తో నాకు ఎంతో భావోద్వేగ అనుబంధం ఉంది. అండర్-19 కోసం కలసి ఆడాము. మ్యాచుల తర్వాత కలసి కూర్చుని హ్యాంగవుట్ అయ్యే వాళ్లం. ఢిల్లీ క్యాపిటల్స్ తో నాకు భావోద్వేగ బంధం ఉంది. నేను వారికి (రికీ పాంటింగ్ తదితరులు) దూరమవుతున్నాను’’ అని అవేశ్ పేర్కొన్నాడు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: