ఆచార్య సెట్స్ లో కొణిదెల సురేఖ జన్మదిన వేడుకలు


ఆచార్య సినిమా షుటింగ్ సెట్స్ లో ఆసక్తికర ఘటన జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో సురేఖకు చెరోవైపున చిరంజీవి, రామ్ చరణ్ ఉన్నారు. ట్విట్టర్ లో ఈ పిక్ పంచుకున్న రామ్ చరణ్... "నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను మరెవ్వరూ అర్థం చేసుకోలేరు... హ్యాపీ బర్త్ డే మా" అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: