ముగింపు దశకు చేరుకొన్న మేడారం జాతర


జనసంద్రాన్ని తలపించిన మేడారం జాతర ముగ్గింపు దశకు చేరుకొంటోంది. ఈ నెల 16 నుంచి అత్యంత వేడుకగా జరుగుతున్న మేడారం జాతర గత నాలుగురోజులుగా మేడారం జనసంద్రాన్ని తలపించింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు. ఈ సాయంత్రం మేడారంలో గద్దెల వద్ద గిరిజన పూజారులు సంప్రదాయ పూజలు చేపట్టారు. దాంతో గద్దెల వద్ద భక్తుల దర్శనాలు నిలిపివేశారు. మేడారం జాతర ముగియనుండడంతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. మేడారం జాతరకు ఈ నాలుగు రోజుల్లో 1.3 కోట్ల మంది వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: