అప్పట్లో లతా మంగేష్కర్ పై విష ప్రయోగం జరిగిందటా

ప్రముఖుల జీవితాల్లో ఎన్నో ఆనంద ఘనలే కాదు...చేదు అనుభవాలు  కూడా ఉంటాయి. అవి బయటకు చాలా తక్కువగా తెలుస్తాయి. లతా మంగేష్కర్ పై ఎవరికైనా అభిమానం ఉంటుందని అనుకుంటాం. కానీ, ఆమెపైనా విషం కక్కే వారు ఉంటారంటే నమ్మగలమా? కానీ, అదే నిజం. ఈ విషయాన్ని లతా మంగేష్కర్ ‘లతా ఇన్ హర్ ఓన్ వాయిస్’ అనే పుస్తకంలో బయటపెట్టారు. ‘‘1963లో ఎంతో బలహీనతకు గురయ్యాను. బెడ్ పై నుంచి లేవలేని పరిస్థితికి వెళ్లిపోయాను. మూడు నెలల పాటు అలానే ఇబ్బంది పడ్డాను. ఓ రోజు నిద్ర లేస్తూనే నా పొట్టలో ఎంతో అసౌకర్యంగా అనిపించింది. ఆకుపచ్చటి వాంతు కూడా అయ్యింది. డాక్టర్ వచ్చి పరిశీలించారు. నేను నడవలేని పరిస్థితుల్లో ఉండడాన్ని చూసి ఎక్స్ రే మెషిన్ ను కూడా ఇంటి వద్దకే తీసుకొచ్చి ఎక్స్ రే తీశారు. నాపై క్రమంగా విష ప్రయోగం జరిగినట్లు చెప్పారు. దాంతో వంట మనిషిని మాన్పించేసి ఆ బాధ్యతను నా సోదరి ఉషా తీసుకుంది. ఎవరో ఒకరు వంట మనిషిని అక్కడ పెట్టారు. ఎవరన్నది మాకు తెలియదు’’అని తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితిని లతా వెల్లడించారు. వైద్యుడు గుర్తించడంతో ఆమె ప్రాణాలు దక్కాయని చెప్పుకోవాలి. నాడు కోలుకున్న తర్వాత ‘బీస్ సాల్ బాద్’ చిత్రం కోసం ‘కహీన్ దీప్ జలే కహీన్ దిల్’ పాట కోసం గాత్రాన్ని అందించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: