ఇండియాలోనే ఐపీఎల్: గంగూలి


కరోనా పరిస్థితి చేయిదాటిపోతే చెప్పలేం కానీ, లేదంటే మాత్రం ఐపీఎల్ ను ఇండియాలోనే నిర్వహిస్తామని బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ చెప్పారు. కరోనా నేపథ్యంలో ఇండియాలో ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. రానున్న సీజన్ కూడా విదేశాల్లోనే జరుగుతుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. కరోనా పరిస్థితి చేయిదాటిపోతే చెప్పలేం కానీ, లేదంటే మాత్రం ఐపీఎల్ ను ఇండియాలోనే నిర్వహిస్తామని చెప్పారు. ముంబై, పూణేలో లీగ్ మ్యాచ్ లను నిర్వహిస్తామని తెలిపారు. అహ్మదాబాద్ లో మ్యాచ్ నిర్వహించడంపై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా తీవ్రత ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గత రెండు సీజన్ల ఐపీఎల్ యూఏఈలో జరిగిన సంగతి తెలిసిందే.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: