సిక్కు యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన ...

వారిని వెంటనే అరెస్టు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ఆవాజ్ కమిటీ డిమాండ్


(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

హైదరాబాదులో సిక్కు యువతి  పై అత్యాచారం చేసి, అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనను ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. యువతి పై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నది.   రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలోని పారిశ్రామిక ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్న 14 సంవత్సరాల వయస్సు గల సిక్కు యువతిని అపహరించి  అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఏ వైపు నుండి ఏ మానవ మృగాలు దాడిచేస్తాయో తెలియని స్థితిలో ఉన్నారు. కేసు విచారణ జరపడంలో  , నేరస్తులను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తున్నారు. ఇదే నిజమైతే ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు. పోలీసు యంత్రాంగం వెంటనే కదిలి నింధితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అని ఆ ప్రకటనలో మహమ్మద్ అబ్బాస్ పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: