అభిమానులకు థాంక్యూ చెప్పిన బంగార్రాజు సినిమా బృందం

బంగార్రాజు సినిమా విడుదలై 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెబుతూ ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. నాగార్జున - నాగచైతన్య కథానాయకులుగా 'బంగార్రాజు' సినిమా రూపొందింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేశారు. పండుగ సందర్భానికి తగిన కథ కావడంతో ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభించింది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి బరిలోకి దిగిన సినిమాల్లో విజేతగా నిలిచింది. ఈ రోజుతో ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెబుతూ ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. నాగార్జున కేవలం నాలుగు నెలల్లోనే ఈ సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం విశేషం. అనూప్ రూబెన్స్ పాటలు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. రమ్యకృష్ణ - కృతి శెట్టి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. నాగ్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న హిట్ ఈ సినిమాతో పడటం విశేషం.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: