విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో...

హిజ్రాల నిరసన

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, కేంద్రమైన పాణ్యం లో  ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యమానికి మద్దతుగా మేము సైతం అంటూ మద్దతుగా నిలిచిన హిజ్రాలు. వివరాల్లోకి వెళితే తే పాణ్యం,గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలని ప్రజలు,విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో గత 17 రోజుల నుండి  పాణ్యం లో జరుగుతున్న నిరసనలకు మేము సైతం  మీవెంటే ఉన్నామని హిజ్రాలు ఇందు, రాములమ్మ ,వినతి, ఆయేషా, సురేఖ, హరిత లు మద్దతు తెలిపారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడివేముల, పాణ్యం మండలాలను నంద్యాల జిల్లాలో కలిపె వరకు మేము కూడా నిరసన కార్యక్రమాలలో పాల్గొంటామని, విద్యార్థి జేఏసీ నాయకులు పోరాటానికి మా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజు నాయుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పెరుగు శివ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ

నంద్యాల మున్సిపాలిటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పాణ్యం,గడివేముల మండలంలోని గ్రామాలు ఉన్నాయని గడివేముల మండలంలోని ప్రజలు, పాణ్యం మండలంలోని  ప్రజలు అందరూ వైద్య,విద్య,నిత్య రవాణా సరుకుల కోసం నంద్యాల కు ప్రతినిత్యం వెళుతుంటారు అని నంద్యాల తో ఎన్నో సంవత్సరాలుగా పాణ్యం, గడివేముల ప్రజలు నంద్యాల తో అనుబంధం ఉందని కావున పాణ్యం,గడివేముల మండలాల్లోని ప్రజలందరూ నంద్యాల జిల్లా కోరుకుంటున్నారని  జిల్లా రెవెన్యూ అధికారి (DRO) పుల్లయ్య  గారికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు జగదీష్, గోపాల్,వేణు,విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: