విజయ్ దేవరకొండ సరసన కియారా అద్వాని


హీరో విజయ్ దేవరకొండ సరసన జోడీకట్టడానికి కియారా అద్వాని ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ భామలు ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటం .. పారితోషికం పరంగా కూడా బాగా గిట్టుబాటు అవుతుండటంతో ఇక్కడి సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎంతమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలా ఇప్పుడు విజయ్ దేవరకొండతో జోడీకట్టడానికి కియారా అద్వాని ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా చేస్తున్నాడు. ఆగస్టులో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఆ తరువాత సినిమాను ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు.  ఇప్పుడు ఈ సినిమా కోసమే కియారాను సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయిందని చెబుతున్నారు. 'భరత్ అనే నేను' .. 'వినయ విధేయ రామ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కియారా, ఆ తరువాత సినిమాను శంకర్ దర్శకత్వంలో చరణ్ సరసన చేస్తోంది. ఈ ప్రాజెక్టు తరువాత ఆమె చేయనున్నది విజయ్ దేవరకొండతోనే అంటున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: