రాజాసింగ్ ను అరెస్టు చేయాలి

ఆవాజ్  తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేయకపోతే బుల్డోజర్ తో మీ ఇల్లు నేల మట్టం చేస్తామని ఓటర్లను బెదిరిస్తున్న బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి అని ఆవాజ్  తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున వస్త్రధారణ (హిజాబ్) పేరుతో ముస్లిం అమ్మాయిల చదువుకు దూరం చేయాలని చూస్తున్న మతోన్మాద చర్యలను ఖండిస్తూ  *ఆవాజ్ జిల్లా నాయకులు ఎం ఎ ఇక్బాల్ డివైఎఫ్ఐ నాయకులు చెన్న రాజేష్ అధ్యక్షతన ఆలేరు టీఎన్జీవో భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తోందని ప్రజలు తమ ప్రభుత్వాల వైఫల్యాలపై చర్చించకుండా ఇప్పటివరకు తన పరిపాలనలో ఎంత మందికి ఉద్యోగాలు కల్పించాం దేశాన్ని ఎంత అభివృద్ధి చేశాము అని చర్చ జరగకుండా ఘర్షణ వాతావరణం సృష్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారు అన్నారు కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ సమస్యను రెచ్చగొట్టి ముస్లిం మహిళలు విద్యకు దూరం చేయాలని తద్వారా తాను అమలు చేయాలనుకున్న మనువాద చట్టాన్ని ఆచరణలో పెట్టాలి అని చూస్తుందని అన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి దాదాపు 70 సంవత్సరాల నుంచి ఇలాంటి ఘర్షణ విద్యా సంస్థలలో జరగలేదని కొన్ని హిందూ మతోన్మాద సంస్థలు ప్రజలను రెచ్చగొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు ఇచ్చిన హక్కులను కాల రాయాలని చూస్తున్నారని బిజెపి తన పరిపాలన ద్వారా దేశాన్ని మధ్యయుగాల నాటి పరిస్థితులకు కు దేశ ప్రజలను తీసుకు వెళుతుందని అన్నారు అదేవిధంగా దేశంలో ప్రజల ఆర్థిక స్థితి రోజుకి దిగజారిపోతున్న ఇప్పటికీ దేశంలో కొన్ని కుటుంబాలు సంపద మాత్రం వందల రెట్లు పెరుగుతుందని అది ఎలా సాధ్యమైందో బిజెపి పాలకులు నరేంద్ర మోడీ అమిత్ షా దేశ ప్రజలకు చెప్పాలని అన్నారు దేశంలో ప్రజలు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడుతూ ఉంటే మన పాలకులు ప్రజల దృష్టిని మరల్చి ఈ దేశ సంపదను ఆ దాని అంబానీలకు అమ్మేస్తున్నారు అని  ఆ అమ్మకానికి దేశ ప్రజల దృష్టికి చర్చకు రాకుండా ఉండడం కోసమే ప్రతి చోటా ఏదో ఒక మతపరమైన ఘర్షణలు సృష్టించి దేశ సంపదను టోకుగా కార్పొరేట్ కంపెనీలకు భారతం చేస్తున్నారని అన్నారు దేశంలో కరోనా కలకలం తో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే దేశంలో అమ్మే వారు ఇద్దరూ కొనేవారు ఇద్దరు అని అమ్మవారు నరేంద్ర మోడీ అమిత్ షా అని కొనేవారు ఆదాని  అంబానీ అని అన్నారు వీరు తప్ప దేశంలో ప్రజలంతా ఎలాంటి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు దేశంలో ఇలాంటి వాళ్ళను ఇంకా కొద్ది కాలం అధికారంలో ఉండనిస్తే  దేశ సంపదను కొల్లగొట్టి ఈ దేశాన్ని నాశనం చేస్తారని మన భవిష్యత్ తరాలు అంధకారం అవుతాయని అన్నారు ఈ కార్యక్రమానికి హాజరైనా మున్సిపల్ చైర్మన్ వస్ పరి  శంకరయ్య మాట్లాడుతూ దేశంలో ప్రజలు లు కులమతాలు వర్గాలుగా విడిపోకుండా ఐక్యమత్యంతో ఉండి దేశాభివృద్ధికి పాటుపడాలని మనకు నచ్చిన ఆహారం తినే హక్కు తనకు నచ్చిన విధంగా దుస్తులు ధరించి అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇచ్చింది అని దీన్ని ఎవరు కాదన్నా వారు ఈ దేశానికి శత్రువులు అవుతారని అన్నారు ఎంతో కాలం చదువుకు దూరమైన మహిళలు ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి చదువు సంధ్య నేర్చి దేశ ఆర్థిక అభివృద్ధి లో భాగస్వామ్యం అవుతుంటే కొన్ని శక్తులు ఇలాంటి అనవసరమైన చర్చలు తీసుకొచ్చి దేశానికి నష్టం చేస్తున్నారు అని అన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎస్ఎఫ్ఐ నాయకులు కాసుల నరేష్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ మోడీగాడి చంద్రశేఖర్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ ఎం డి జైన్ఉద్దీన్ మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ ఎండి రియాజ్ సిపిఐ ఎంఎల్ నాయకులు పద్మ సుదర్శన్ ఈ ఇక్కీరి కుమార్ రజక సంఘం నాయకులు వడ్డెమాను శ్రీనివాసులు టిఆర్ఎస్ నాయకులు షరాబు సంతోష్ ఎండి ఫయాజ్ ఎండి షాబుద్దీన్ వెంకటయ్య బీఎస్పీ నాయకులు తుంగ కుమార్ యూత్ కాంగ్రెస్ నాయకులు కళకుంట్ల లోకేష్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు విక్రమ్ ప్రైవేటు ఉపాధ్యాయులు guduguntla యాకోబు ఆవాజ్ జిల్లా నాయకులు ఎండి బద్రు ఎండి అజ్మత్ ఎండి సలీం ఎండి గౌస్ తాజ్ షకీల్ పి డి ఎస్ యు నాయకులు నిశాంత్ వడ్డెమాను విప్లవ్ మోరీగాడి పృద్వి ఎండి రసూల్ తదితరులు పాల్గొన్నారు *ఈ సమావేశానికి హాజరైన ప్రతి ప్రజా సంఘాలు పార్టీల నాయకులు కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ పై విద్యాసంస్థల్లో జరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: