మైనారిటీ సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించాలి

ఆవాజ్ కమిటీ ఆధ‌్వర్యంలో ధర్నా

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ..ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.  ఈ  సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఉన్నారని, వారిని ఆదుకోవడానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని అన్నారు. 5వేల కోట్ల రూపాయలు కేటాయించి మైనారిటీ బంధు పథకం ప్రకటించి పేద మైనారిటీలకు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి 10లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమానికి ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ సత్తార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్,నాయకులు ఇబ్రహీం, బాబా, అక్బర్, అహ్మద్ ,  జలాలు, అబ్దుల్ రెహమాన్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: