పెండింగ్ లో ఉన్న 535 ఉర్దూ మీడియం ...

ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి

సిఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

టీఆర్టీ 2017 లో పెండింగ్ లో 535 ఉన్న ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ 6 సంవత్సరాలుగా ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చెయ్యకుండా ప్రభుత్వం ఉర్దూ మీడియం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నదన్నారు.


900 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం కేవలం 365 పోస్టులు భర్తీ చేసి 535 పోస్ట్ లు పెండింగ్ లో పెట్టారు. అర్హత పరిక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు చదువు అందడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 535 ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం టీఆర్టి 2017 స్ట్రగుల్ కమిటీ అధ్యక్షులు మోహిజ్, షారూఖ్, ఫర్జానా తదితరులు పాల్గొన్నారు. అందరిని అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: