సన్నీలియోన్ పాన్ కార్డుపై రూ.2 వేల రుణం తీసుకొన్న అగాంతకుడు


దేశంలో జరిగే మోసాలలో కొన్ని వింతలు కూడా చోటుచేసుకొంటూవుంటాయి. అలాంటి వింతే ఇక్కడా జరిగింది. బాలీవుడ్ నటి, పోర్న్ చిత్రాల మాజీ నటి సన్నీ లియోన్ తన పాన్ ను ఎవరో దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ‘‘ఎవరో ఇడియట్ నా పాన్ కార్డు సాయంతో రూ.2,000 రుణం తీసుకున్నాడు. నా సిబిల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ (ధనిస్టాక్స్, గతంలో ఇండియా బుల్స్ సెక్యూరిటీస్) నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది’’ అంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది. నిజానికి సన్నీ లియోన్ ఒక్కరే బాధితురాలు కాదు. నిత్యం వందలాది మోసాలు ఇలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐవీఎల్ సెక్యూరిటీస్ వంటి డిజిటల్ యాప్స్ ను మోసగాళ్లు వేదికలుగా చేసుకుంటున్నారు. అయితే, సన్నీ లియోన్ తన ట్వీట్ ను ఆ తర్వాత తొలగించడంతో కొందరు యూజర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది.   ముందు ట్వీట్ ను తొలగించడానికి కారణం తన సమస్య పరిష్కారమైనట్టు సన్నీ చెప్పింది. ‘‘ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సిబిల్ కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్యను పరిష్కరించారు. ఇది పునరావృతం కాదని భావిస్తున్నాను. ఇదే విధమైన సమస్య ఇతరులకు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తాను. చెత్త సిబిల్ స్కోర్ ను ఎవరూ కోరుకోరు’’ అంటూ తాజా ట్వీట్ ను సన్నీ వదిలింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: