కరోనా మహమ్మారి పై అప్రమత్తంగా ఉండండి

ప్రభుత్వ వైద్యాధికారిణి డాll సృజన

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండల పరిధిలోని గ్రామ ప్రజలు ఒమిక్రాన్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో గడివేముల మండలం లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గడివేముల ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ సృజన తెలిపారు. వివరాల్లోకి వెళితే గడివేముల మండలం లో ఐదు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను వారి వారి ఇళ్ల వద్దనే ( హోం క్వారంటైన్ ) లో ఉంచి వారికి ఏఎన్ఎం ద్వారా కావలసిన వైద్య సేవలను అందిస్తున్నామని, బిలకలగూడూరు గ్రామం లో ఒక పిల్లవాడికి కరోనా పాజిటివ్ రాగా ఆ అబ్బాయిని మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించామని, కావున మండలం లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు.


ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, తప్పని సరిగా మాస్కులు ధరించి అవసరమైన విషయాలు మాత్రమే ఇంటి వద్ద నుండి బయటకు రావాలని అనవసరంగా బహిరంగ ప్రదేశాలలో గుంపులుగుంపులుగా ఉండి కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుండి బంధువులు స్నేహితులు వస్తూ ఉంటారని అలా వచ్చిన బంధువులకు గానీ, స్నేహితులకు గానీ, విపరీతమైన జ్వరం, దగ్గు,జలుబు, లక్షణాలు ఏమైనా ఉంటే అలాంటి వారు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందించు కోవాలని, అదే విధంగా రెండు డోసులు వేసుకున్నాం మాకు కరోనా రాదని విచ్చలవిడిగా


బహిరంగ ప్రదేశాలలో తిరగరాదని, తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని ఆమె తెలిపారు. మండల పరిధిలోని హై స్కూలు మరియు కాలేజీల లోని విద్యార్థిని విద్యార్థులకు 100% వ్యాక్సినేషన్ వేశామని, ప్రస్తుతం 60 సంవత్సరాలు దాటిన ప్రజలకు బిపి మరియు షుగర్ ఉన్నవారికి picasso వ్యాక్సినేషన్  వేస్తున్నామని, కావున 60 సంవత్సరాలు పూర్తయిన ప్రజలందరూ పికాసో వ్యాక్సినేషన్ ను వేయించుకోవాలని ఈ వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకుండా అందరు picasso వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, బూస్టర్ డోస్ ను ఇప్పటి వరకు 600 మందికి వేశామని ఇంకా ఎవరైనా వేయించుకొని వారు ఎవరైనా ఉంటే వారు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వచ్చి వేయించుకోవాలని, ఆమె తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: