మరో మూడు వారాల్లో కాస్త కష్టమే


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

మరో మూడు వారల్లో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచాన్ని ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. రోజు రోజుకు వైరస్ తన వ్యాప్తిని విస్తరింపచేస్తోంది. ఈ మహమ్మారి దాటికి జనాలు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. రోజు రోజుకు లక్షలాది మంది కరోనా భారిన పడుతున్నారు. తాజాగా, ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయోద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గత వేరియంట్లు ఊపిరిత్తుల పనితీరుపై ప్రభావం చూపితే.. ఒమిక్రాన్ శరీర ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది . సాధారణ లక్షణాలే కన్పిస్తున్నాయని క‌దా అని నిర్లక్ష్యం వహించవద్దని చెప్పింది. ఇది సాధారణ జలుబు లాంటిది కాదని, మనిషి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని పేర్కొంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 128 దేశాలకు పైగా ఒమిక్రాన్‌ వ్యాప్తించిందని డబ్యూహచ్‌వో ప్రకటించింది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుద‌ల‌ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో కరోన, ఒమిక్రాన్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరడగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే .. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండు మూడు వారాల్లో కరోనా ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని తెలిపింది. అటు ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు భారత్ ప్రభుత్వ సిద్ధంగా ఉంది. కరోనా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని నిబంధనలు అమలు చేస్తోంది. ప‌లు రాష్ట్రాలు ఇప్ప‌టికే నైట్ క‌ర్ప్యూలు అమ‌లు చేస్తున్నాయి . స్కూళ్లు, కాలేజీల‌ను మూసివేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: