నియంత్రించడానికి బూస్టర్ డోసే మార్గం


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

కరోనా వైరస్ తొలి దశ, రెండో దశ, థర్డ్ వేవ్ ఇలా పలు రూపాల్లో దాడి చేస్తున్న నేపథ్యంలో వీటిని అంతం చేయాలంటే బూస్టర్ డోస్ టీకాయే మార్గమన్న చర్చ వైద్య నిపుణులలో సాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆందోళనల నడుమ కరోనావైరస్ వ్యాక్సీన్ బూస్టర్ డోసుపై చర్చ జరుగుతోంది. ఈ డోసు ఎవరికి ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో చూద్దాం. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మూడో డోసు వ్యాక్సీన్ ఇవ్వబోతున్నట్లు డిసెంబరు 25న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. బూస్టర్ డోసుపై చాలా దేశాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని దేశాలు తమ ఆరోగ్య సిబ్బందికి మూడో డోసు టీకాలు ఇస్తున్నాయి. మూడో డోసుతో వైరస్ నుంచి ముప్పు మరింత తగ్గుతుందని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) కూడా వెల్లడించింది. ఇంతకీ బూస్టర్ డోసు అంటే ఏమిటి? ఒమిక్రాన్ నుంచి ఇది ఎంతవరకు రక్షణ కల్పిస్తుంది? మూడో డోసు ఇవ్వాలని భారత్ ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఈ డోసు తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి? కరోనా ఒక వ్యాధిపై పోరాడేలా శరీరాన్ని సిద్ధం చేసేందుకు వ్యాక్సీన్లు అవసరం అవుతాయి. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ డోసుల వ్యాక్సీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత తీసుకునే డోసును బూస్టర్ డోసుగా పిలుస్తారు. బూస్టర్ డోస్ అనేది మన చదువు లాంటిదేనని బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి జేమ్స్ గళ్లఘెర్ తెలిపారు. ''మొదటి డోసు ప్రాథమిక స్కూల్ లాంటిది. అక్కడ మీరు అక్షరాలతోపాటు ప్రాథమిక విషయాలు తెలుసుకుంటారు. కానీ, ఇది సరిపోదు. ఆ తర్వాత మీరు మాధ్యమిక విద్య చదవాలి. ఆ తర్వాత కాలేజీ లేదా యూనివర్సిటీ విద్య’’అని ఆయన అన్నారు. వైరస్‌ను అడ్డుకోవడంతోపాటు దానితో ఎలా పోరాడాలో రోగ నిరోధక వ్యవస్థకు నేర్పించడంలో బూస్టర్ డోసులు ఉపయోగపడతాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: