అలా సీఎం అభ్యర్థి అయ్యారు...ఇలా బంధువులపై ఐటీ దాడులు


రాజకీయాలలో ఉండే మజావేరయా అని చెప్పవచ్చు. అందుకే రాజకీయాలలో రాణించాలంటే రిస్క్ కూడా కాస్త ఎక్కువే మరి. పంజాబ్ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని బంధువుల నివాసాలలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. మొహాలీలో ముఖ్యమంత్రి బంధువు భూపిందర్ సింగ్ హనీ నివాసంతోపాటు 10 ప్రాంతాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు నడుస్తున్నాయి. భూపిందర్ సింగ్ ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇసుక మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించారు. మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించేందుకు నల్లధనాన్ని ఇన్వెస్ట్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఎందుకంటే భూపిందర్ పెట్టిన కంపెనీ చాలా చిన్నది. అంత పెద్ద కాంట్రాక్టులు తీసుకునే స్థాయిలో లేకపోవడమే ఈ అనుమానాలకు నేపథ్యంగా ఉంది. ఇసుక కాంట్రాక్టులు, ఇసుక మాఫియాపై ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారని ఆప్ సైతం ఆరోపణలు గుప్పిస్తోంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: