చైనా పండ్లలోనూ వైరస్ దూరింది


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

చైనా కారణంగానే కరోనా పుట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుంటే మరోవైపు ఆ దేశపు పండ్లలో కరోనా వైరస్ చేరిందని తెలుస్తోంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారితో యావత్ ప్రపంచం అల్లాడుతోంది. అయినా దాని మూలాల గురించి పరిశోధకులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. రోజుకో కొత్త రూపంలో విరుచుకుపడుతున్న మహమ్మారి.. జనజీవనాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా, మహమ్మారి గురించి మరో ఆందోళన కలిగించే విషయం బయటపడింది. కరోనా వైరస్‌కు సంబంధించిన ఆనవాళ్లు డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నట్లు వెల్లడయ్యింది. చైనాలోని జెజియాంగ్, జియాంగ్జీ ప్రావిన్సులలోని 9 నగరాల్లో ఈ పండ్లపై జరిపిన పరీక్షలలో వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం. వివిధ మార్గాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. తాజాగా డ్రాగ‌న్ ఫ్రూట్స్ ద్వారా కరోనా వైర‌స్ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వియత్నాం, తైవాన్ నుంచి దిగుమ‌తి చేసుకున్న డ్రాగ‌న్ ఫ్రూట్‌లో వైర‌స్‌ను గుర్తించారు. అత్యాధునిక స్కానింగ్ ద్వారా డ్రాగ‌న్ ఫ్రూట్‌ల‌లో వైర‌స్ ఉన్న‌ట్టు గుర్తించ‌డంతో జెజియాంగ్, జియాంగ్ షీ ప్రావిన్స్‌లోని 9 న‌గ‌రాల్లోని సూప‌ర్ మార్కెట్ల‌ను మూసివేశారు. సాధారణంగా పండ్ల‌ ద్వారా వైర‌స్ వ్యాపించ‌ద‌ని, డ్రాగ‌న్ ఫ్రూట్స్ ద్వారా కరోనా ఎలా వ్యాపిస్తుందో అర్ధం కావ‌డం లేద‌ని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా తైవాన్, వియత్నాం నుంచి దిగుమ‌తుల‌ను నిలిపివేసి, సూప‌ర్ మార్కెట్ల‌ను మూసివేశారు. అలాగే, పండ్లను కొనుగోలుచేసినవారు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వియత్నాం సరిహద్దుల్లోని లాంగ్ సన్, తన్ తన్హా ప్రావిన్సుల ద్వారా డ్రాగన్ ఫ్రూట్స్‌ దిగుమతిని నిలిపివేశారు. మార్గమధ్యంలో పండ్ల లోడ్‌లతో ఉన్న ట్రక్కులను వెనక్కు పంపారు. ఫిబ్ర‌వ‌రిలో వింట‌ర్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని చైనా జీరో వైర‌స్‌కు క‌ట్టుబడి నిబంధ‌న‌లు అమ‌లు చేస్తోంది. క‌ఠిన‌ ఆంక్ష‌లతో క‌రోనాను క‌ట్ట‌డికి చ‌ర్య‌లు చేపట్టిన సంగ‌తి తెలిసిందే. మూడు నాలుగు కేసులు బ‌య‌ట‌ప‌డినా ఆయా న‌గ‌రాల్లో వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు లాక్‌డౌన్‌లను అమలు చేస్తుంది. ఇప్ప‌టికే జియాంగ్‌, యూనాన్, యుజౌ

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: