భారీగా పెరుగుతున్న నిరుద్యోగం


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

దేశం పురోగతి సాధిస్తోందన్న మాటలు మనం వింటున్నాం. కానీ వాస్తవంగా భారతదేశం నిరుద్యోగంలోకి నెట్టబడుతోందని తేలింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ ప్రకారం, భారత్‌లో నిరుద్యోగిత రేటు డిసెంబర్‌లో దాదాపు 8 శాతానికి పెరిగింది. 2020లో, 2021లో చాలావరకు ఇది 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ''తాజా నిరుద్యోగిత రేటు, భారతదేశంలో కనీసం గత మూడు దశాబ్ధాలుగా నమోదైన దానికంటే చాలా ఎక్కువ. 1991నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఇలా లేదు'' అని వరల్డ్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు అన్నారు. 2020లో చాలా దేశాల్లో నిరుద్యోగం పెరిగింది. కానీ భారత్‌లో ఇది మరింత ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్ (5.3 %), మెక్సికో (4.7 %), వియత్నాం (2.3 %) లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల కంటే కూడా భారత్‌లో ఈ నిరుద్యోగం రేటు అధికంగా ఉంది. అంతేకాకుండా చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా కాలంలో ఖర్చును తగ్గించుకోవడానికి, ఉద్యోగులను తొలగించే పద్ధతిని కంపెనీలు అవలంభించడం ఇందుకు ఒక కారణమని సీఎంఐఈ పేర్కొంది. 2020 లాక్‌డౌన్ కాలంలో, 15 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వర్కర్లే దీనివల్ల ఎక్కువగా నష్టపోయారని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తెలిసింది. ''అంతా గందరగోళంగా ఉంది. లాక్‌డౌన్‌కు ముందు ఉద్యోగాలు చేస్తోన్న వారిలో సగం మంది ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు మేం కనుగొన్నాం'' అని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఎకనమిస్ట్ అమిత్ బసోల్ చెప్పారు. ''వర్కర్లు, చిన్నతరహా వ్యాపారుల శ్రేయస్సు కోసం పాలసీలను రూపొందించడంలో తక్కువ శ్రద్ధ చూపించారనే వాస్తవానికి భారత్‌లోని పరిస్థితులు అద్దం పడుతున్నాయి. 2020 లాక్‌డౌన్ కాలంలో దీన్నిమనం చూశాం'' అని ప్రొఫెసర్ బసు అన్నారు. భారత్‌లో పేరుకుపోయిన నిరుద్యోగం స్థితిగతులను తాజా గణాంకాలు, లెక్కలు పూర్తిగా వివరించలేవు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: