రైలు ఎక్కాలంటే...రెండు డోసులు వేయించుకొని ఉండాలి


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

ప్రయాణాలపై కఠిన చర్యలు తీసుకొనే దిశగా రైల్వేశాఖ చర్యలు తీసుకొంది. కరోనా ఒకరి నుంచి మరోకరికి వ్యాపిస్తున్న తరుణంలో పయనించే ప్రయాణికులు తీసుకొంన్న వ్యాక్సిన్ లపై ప్రత్యేక నజర్ రైల్వే శాఖ సారించింది. దేశంలో మరోసారి కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో, కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికే చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణానికి టికెట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. రెండు డోసులు తీసుకోని వారిని లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణికులు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని దక్షిణ రైల్వే వివరించింది. ఈ నిబంధనలో ఎలాంటి సడలింపులు ఉండబోవని, సీజన్ టికెట్ తీసుకునేవారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు మొబైల్ ఫోన్లలో అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) అందుబాటులో ఉండదని కూడా వెల్లడించింది. తమిళనాడులో భారీగా కరోనా కేసులు వస్తుండడం తెలిసిందే. శుక్రవారం నాడు ఒక్కరోజే 8,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 121 ఒమిక్రాన్ కేసులు కూడా గుర్తించారు. 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: