మా ఆవిడ నీకు...నీ ఆవిడ నాకు: కేరళలో జగుప్సకర ఘటన


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

ఆధునికత ముసుగులో కొనసాగుతున్న విష పాశ్చాత్యపోకడలు  సమాజాన్ని నాశనం చేస్తున్నారు. దీంతో జీవితాలే నాశనమవుతున్నాయి. ఇలాంటి ఘటనే కేరళలో వెలుగులోకి వచ్చింది. కేరళలలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోతున్నాయి. తమ జీవిత భాగస్వాములను వేరే వారికి అప్పగించి.. ఇతరుల భాగస్వాములతో లైంగిక సుఖాన్ని పొందాలనుకునే భావజాలం క్రమంగా విస్తరిస్తోంది. బలవంత పెట్టి మరీ భార్యలను ఇందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది నచ్చని ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. తన భర్త.. మరో పురుషుడితో లైంగిక సంబంధానికి బలవంతం చేస్తున్నాడంటూ ఓ బాధితురాలు కేరళలోని కురుకచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కయంకులమ్ లోనూ ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల  సాయంతో ఒక గ్రూపు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి, వీటి ద్వారా సభ్యుల మధ్య అనుసంధానత కల్పిస్తున్నారు. తమకు ఫిర్యాదు చేసిన బాధితురాలి భర్తను అరెస్ట్ చేశామని, దీని వెనుక పెద్ద ముఠానే ఉందని చంగన్ చెర్రి డీఎస్పీ ఆర్.శ్రీకుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమ గ్రూపుల ద్వారా నడుస్తున్న భాగస్వాముల మార్పిడి ముఠాలో సుమారు 1,000 మంది వరకు ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఉన్నత కుటుంబాల వారు కూడా ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 25 మందిపై నిఘా ఉంచారు. మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: