యూపీలో ఊపందుకొన్న ఆవు రాజకీయాలు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆవు రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. ఈ రెండు కథలను అర్ధం చేసుకోవడానికి మనం 2017 సంవత్సరంలో వెళ్లాలి. 15 ఏళ్ల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి ఏర్పడింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆయన ప్రభుత్వం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని వేలాది అక్రమ కబేళాలను మూసివేయడం ఇందులో ముఖ్యమైంది. ''రాష్ట్రంలో అక్రమ కబేళాలను మూసేయించిన ప్రభుత్వం ఇదే. గోవుల అక్రమ రవాణాను కూడా అరికట్టాం. ఆవు పట్ల ఎవరైనా క్రూరంగా వ్యవహరిస్తే వారు జైలులో కూర్చోవాల్సి ఉంటుంది'' అంటూ ఓ సభలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అక్రమ కబేళాల మూసివేత, గొడ్డు మాంసం తినడం, ఆవుల స్మగ్లింగ్ పేరుతో అనేక హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి. ముజఫర్‌ నగర్, అలీగఢ్, బలరాంపూర్, బారాబంకి, హమీర్‌పూర్ వంటి అనేక ఇతర జిల్లాల పోలీస్ స్టేషన్లలో ఆవుల స్మగ్లింగ్, గోహత్య కేసులు పెరిగాయి. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 2018లో గోహత్య ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ సుబోధ్ సింగ్‌ను ఆగ్రహంతో ఉన్న ఓ గుంపు కాల్చి చంపింది. మరోవైపు రాష్ట్రంలోని రోడ్లపై సంచరించే పశువుల సంఖ్య పెరుగుతోంది. వాటి ఆకలి కూడా పెరిగి పోయింది. రాజధాని లఖ్‌నవూకు కొన్ని గంటల ప్రయాణం పట్టే మిల్కిపూర్ ప్రాంతంలోని సింధౌర మౌజా అనే గ్రామానికి చెందిన శివ పూజన్‌ అనే వ్యక్తి మాకు తారసపడ్డారు. ఆయన అప్పడే బస్సు దిగి వస్తున్నారు. చేతికి కట్టు, దాని మీద రక్తం మరకలు కనిపించాయి. ''నాలుగు రోజుల కిందట నా పొలంలో పశువులు మేస్తున్నాయని తెలిసి అక్కడికి వెళ్లాను. అవి నా వెంటపడ్డాయి. నేను పరుగెత్తాను. అక్కడే ఉన్న ఫెన్సింగ్ తగిలి కింద పడిపోయాను. నా చెయ్యి విరిగింది. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాను'' అని శివ పూజన్ వివరించారు. దేశంలో దాదాపు 20 కోట్ల పశువులు ఉన్నట్లు అంచనా. అందులో అత్యధికం ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉన్నాయి. దేశంలో సగటున 50 లక్షలకు పైగా అనాథ పశువులు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో వీటి సంఖ్య 15 శాతానికి పైగా పెరిగిందని ప్రభుత్వ గణాంకాలలో తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆవు రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ '' ఆవు కొందరికి ఆహారం కావచ్చు. కానీ, మనకు ఆవు తల్లి. పూజించదగ్గది. ఆవును, గేదెను హేళన చేసేవాళ్లు ఒక విషయం మర్చి పోతున్నారు. పశువుల ద్వారా ఎనిమిది కోట్ల కుటుంబాలకు జీవనోపాధి దొరుకుతోంది'' అని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. '' రాష్ట్రంలో బీజీపీ విధానాల వల్ల లక్షలాది పశువులు రైతుల ఆశలను అడియాశలు చేశాయి'' అన్నారు. గత నాలుగన్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు కష్టాలను పెంచింది తప్ప ఏమీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: