సీఎం కుటుబంపై కరోనా పంజా


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

కరోనా భారిన పడుతున్న వారిలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటున్న వీఐపీ, రాజకీయ నేతల కుటుంభాలు అధికమవుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. రికార్డుస్థాయిలో రోజువారీ కేసులు నమోదువుతున్నాయి. పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నేతలు, ప్రముఖులు కరోనాబారిన పడుతున్నారు. తాజాగా, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణి, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ -19 పరీక్షలు చేసినట్లు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. వీరిలో 24 మంది ఫలితాలు శనివారం సాయంత్రం రాగా... 15 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలిందన్నారు. ముఖ్యమంత్రి సతీమణి కల్పనా సోరెన్, కుమారులు నితిన్, విశ్వజీత్, హేమంత్ సోరేన్ వదిన సరళ ముర్ము, ఓ సెక్కూరిటీ గార్డు సహా మంది కోవిడ్ బారినపడ్డారని సీఎంఓ వెల్లడించింది. అయితే, అందరికీ స్వల్ప లక్షణాలే ఉండటంతో హోం ఐసోలేషన్‌లోనే చికిత్స కొనసాగుతుందని సీఎంఓ కార్యాలయం తెలిపింది. ఇప్పటికే ఝార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన జబల్బూర్‌లోని తన నివాసంలో చికిత్స తీసుకుంటున్నారు. తనకు కోవిడ్ సోకిన విషయాన్ని మంత్రి బన్నా గుప్తా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నేను మరోసారి కరోనా బారినపడటంతో విధులకు దూరంగా ఉన్నాను.. గత కొన్ని రోజుల నుంచి ఒంట్లో నలతగా ఉండటంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాయి.. ఫలితాల్లో పాజిటివ్ వచ్చింది.. ఇటీవల నన్ను కలిసినవారంతా తప్పకుండా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.. నేను హోం ఐసోలేషన్‌లోనే ఉన్నాను’’ అని తెలిపారు. ఝార్ఖండ్ ఆరోగ్య మంత్రి 2020 ఆగస్టులో వైరస్ బారినపడ్డారు. మరోవైపు, ఝార్ఖండ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం అక్కడ కొత్తగా 5,081 కేసులు వెలుగుచూడగా, మరో ముగ్గురు చనిపోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,74,000కు చేరుకున్నాయి.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: