నిరూపిస్తే రాజీనామా


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

అక్రమాలు జరిగినట్లు పరిటాల సునీత, శ్రీరామ్ నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్‌ విసిరారు. తెలుగు దేశం పాలనలో అనంతపురం జిల్లా రాప్తాడులో అవినీతి, దౌర్జన్యాలు చేసింది పరిటాల కుటుంబీకులేనని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే తోపుదుర్తి, ఆయన సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి (చందు) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి మాట్లాడుతూ.. పరిటాల సునీత, శ్రీరామ్‌ వంటి వ్యక్తులు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తోపుదుర్తి మహిళా డైరీలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదని పేర్కొన్నారు. ఒకవేళ అక్రమాలు జరిగినట్లు పరిటాల సునీత, శ్రీరామ్ నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్‌ విసిరారు. ‘‘పాల డైరీ డిపాజిట్ నిధులు ప్రకాష్ రెడ్డి వాడుకున్నాడు అని పరిటాల సునీత ఆరోపిస్తున్నారు.. నేను, నా కుటుంబం, డైరీ సభ్యులు డబ్బు వాడినట్లు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. ఉద్యమకారులు, టీడీపీ కార్యకర్తల పునాదులపై పైకి వచ్చిన పరిటాల కుటుంబం.. బెంగళూరు, హైదరాబాద్, అనంతపురంలో మొత్తం 4 భారీ భవంతులు నిర్మించుకున్నారని చెప్పారు. వందల ఎకరాల భూములు కియా, పాలసముద్రం, అనంతపురం పరిసరాల్లో సంపాదించుకున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ఆరోపించారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ వద్ద సుమారు 200కు పైగా ఎకరాలు పరిటాల ఫ్యామిలీకి ఉందని దుయ్యబట్టారు. భూస్వాములపై పోరాటం అని చెప్పిన పరిటాల కుటుంబం.. 600 ఎకరాలకు పైగా సంపాదించి వీళ్లే భూస్వాములయ్యారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ ఆర్థిక మూలాల దెబ్బతీశారని ఎమ్మెల్యే తోపుదుర్తి ఆరోపించారు. తాము ఇల్లు కట్టిస్తున్నట్లు పరిటాల సునీత అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉన్నామని వివరించారు. ఒకవేళ తమకు సొంత ఇల్లు ఉందని నిరూపిస్తే, మా ఆస్తులు పేదలకు పంచుతాం... మీ ఆస్తులు పంచడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: