అభిమానుల  కోరిక తీర్చే ప్రయత్నంలో


(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

సూర్య, కార్తీక ఇద్దరు పేరున్న అగ్ర కథనాయకులు  ఇక వారిద్దరు ఒకే సినిమాలో జంటగా చూడాలని ముచ్చట పడుతున్న అభిమానుల కోరిక తీర్చేందుుకు వారు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు ఇద్దరూ కూడా స్టార్ హీరోలుగా రాణించడం చాలా అరుదు. అలాంటి హీరోల జాబితాలో కోలీవుడ్ నుంచి సూర్య - కార్తి కనిపిస్తారు. ఇద్దరూ కూడా వైవిధ్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకూ రొటీన్ కి భిన్నంగా ఉండే కథలను చేయడానికే ఆసక్తిని చూపుతుంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరి చేతిలో ఉన్న సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్స్ కి చెందినవే. వారిలోని విలక్షణమైన నటనను ఆవిష్కరించేవే. ఈ ఇద్దరిని ఒకే సినిమాలో .. ఒకే తెరపై చూడాలని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరూ కలిసి 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా తమిళ రీమేక్ లో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత అందులో నిజం లేదనే వార్తలు వచ్చాయి. అయితే అన్నదమ్ములిద్దరినీ ఒకే కథలో చూడాలనుకునే అభిమానుల ముచ్చట ఈ ఏడాది తీరనున్నట్టు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఒక మల్టీ స్టారర్ ను లైన్లో పెట్టడానికి వాళ్లిద్దరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: