ఘనంగా రైతు బంధు సంబరాలు


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రైతు బంధు పథకంతో  రాష్ట్రంలోని రైతుల ఇళ్లలో సంబరాలు నింపుకొన్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని... ప్రతి ఒక్కరూ ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్నారని  అన్నారు. రాష్ట్రంలో రైతుబంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. రేపటితో రూ. 50 వేల కోట్ల రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలిపారు. బీజేపీ దొంగ నాటకాలు ఆడుతోందని... కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మధ్యే కుమ్ములాటలున్నాయని చెప్పారు. ప్రజల మధ్య అల్లకల్లోలాలను సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: