వృద్ధాప్యం కారణంగా కోలుకోలేకపోతున్నారు


లతా మంగేష్కర్ వృద్ధాప్యం కారణంగా త్వరగా కోలుకోలేకపోతున్నారని, ఆమె ఆరోగ్యవంతురాలు కావడానికి మరికొంత సమయం పడుతుందని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో లతాకు చికిత్స చేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ ప్రతీత్ సందానీ పేర్కొన్నారు. గానకోకిల లతా మంగేష్కర్ కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో లతాకు చికిత్స చేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ ప్రతీత్ సందానీ తెలిపారు. లతా మంగేష్కర్ వృద్ధాప్యం కారణంగా త్వరగా కోలుకోలేకపోతున్నారని, ఆమె ఆరోగ్యవంతురాలు కావడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. లతా మంగేష్కర్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: